గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం
హైదరాబాద్,T6న్యూస్, జూలై 4: హైదరాబాద్‌లోని గాంధీభవన్ సమీపంలో గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ భేటీ సందర్భంగా అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును భవనంలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భద్రతా సిబ్బందితో…
