తొర్రూరులో ఈ నెల 11న ఘనంగా బీరప్ప స్వామి–కామరతి దేవి కళ్యాణ మహోత్సవం
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న శ్రీ బీరప్ప స్వామి, కామరతి దేవి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు….
