కనగల్, T6 న్యూస్: మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో ఆదివారం పీర్ల పండుగను భక్తులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున డప్పు చప్పులు మేళ తాళాలు మధ్య ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సవార్లకు నీళ్ళారా పోసి దట్టీలు గట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే పీర్ల పండుగ ముతాబలీలు హల్వా వేడుకలను ముందుగా నిర్వహించారు. ఆదివారం ఉదయం కాసిం సవార్ను ఇంటింటికి తిరుగుతూ ఊరేగింపు జరిపారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ అజీజ్, ముతాబలీలు మట్టపల్లి బిక్షం, చిన్న బిక్షం, ప్రశాంత్, శ్రీను, మట్టయ్య ,గోపాలు, మాజీ సర్పంచ్ పోచ మల్ల లింగయ్య, ఉప సర్పంచులు, గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


