
సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్
10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం
కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా డిసిపి రాజేష్ మాట్లాడుతూ..


పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండడంతో గుట్కాలు, తయారీ,గంజాయి విక్రయించడం,

అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కార్డన్ సెర్చ్ లో 10 సిఐలు,20 మంది ఎస్సైలు,100 హెడ్ కానిస్టేబుల్,ఏఎస్ఐలు, హోంగార్డులు,ఉమెన్ కానిస్టేబుల్,సిబ్బంది పాల్గొన్నారు.

