Headlines

జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తాం. సి ఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన జిల్లాగా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించారు. ✅ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి…

Read More

మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

హైదరాబాద్: ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు. EK-526 విమానాన్ని పేల్చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆగంతకులు మెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు బాంబు స్క్వాడ్, పోలీసులు…

Read More

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!

హైదరాబాద్: రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తి అవుతుందని వివరించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రణాళికలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి…

Read More

సమంత ఆస్తి రాజ్ కంటే 29% ఎక్కువ.. ఆసక్తికర లెక్కలు

కోయంబత్తూరులో వివాహం చేసుకున్న సమంత, రాజ్ నిడమూరుల ఆస్తులపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరి ఉమ్మడి ఆస్తి సుమారు 200 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇందులో సమంత వాటా 110 కోట్లు కాగా, రాజ్ నిడమూరు ఆస్తి 85 కోట్లుగా ఉంది. దీంతో, సమంత ఆస్తులు రాజ్ కంటే దాదాపు 29 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఒక హీరోయిన్ తన భర్త కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండటం పరిశ్రమలో అరుదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More

భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి

కొత్తగూడెం,T6 న్యూస్: దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు. ✅ కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఉప…

Read More

అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

హైదరాబాద్,T6 న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులను అన్ని వర్గాల ప్రజలు గెలిపించాలని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు కంది సూర్యనారాయణ, ప్రముఖ కవి రాపోలు సుదర్శన్ అన్నారు. సోమవారం చాదర్ఘాట్ సీతారాములయ్య ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు ఇప్పటివరకు చట్టసభల్లో అవకాశాలు దక్కలేదని, ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులు గెలిచేలా…

Read More