Headlines

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

చింతపల్లి, T6న్యూస్: అక్రమ అరెస్టులతో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఉద్యమాలను ఆపలేరని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ లో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం సందర్భంగా నేడు చింతపల్లి పోలీసులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ విద్యార్థి యువజన సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు…కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు మా ఉద్యమాలు మరింత ఉధృతంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నల్ల శంకర్, వందనపు ఆంజనేయులు, ఉప్పల యాదయ్య, మైనార్టీ నాయకులు కాలేధ్, బిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ఆరెకంటి మురళి మాదిగ, బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు సీమర్ల శ్రీను యాదవ్, ఆరెకంటి పృధ్వీరాజ్, రాశిక శ్రీశైలం, మాసాని పవన్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share