

ఇబ్రహీంపట్నం, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థలో నేడు 21 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను మరియు పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గురు నానక్ విద్యాసంస్థలైన జి.ఎన్.ఐ.టి.సి మరియు జి.ఎన్.ఐ.టి నుండి సుమారు 1970 మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించడం జరిగింది. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు పొందిన గ్రాడ్యుయేట్లకు 54 గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను బహుకరించారు. సుమారు 205 కు పైగా బహుళ జాతి కంపెనీలలో ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన సుమారు 1679 మంది విద్యార్థులకు గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం ఉద్యోగ నియామక పత్రాలను, ప్రశంసా పత్రాలను అందచేశారు. ఈ సందర్బంగా విద్యాసంస్థల ప్లేసెమెంట్ విభాగ అధికారులు వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల జాబితా విడుదల చేస్తూ వారిని ఎంపిక చేసిన సంస్థలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ నుండి 153 మంది విద్యార్థులను దూత్ ట్రాన్స్మిషన్ సంస్థ వారు, ఏ.ఎస్.సి ఇంటర్నేషనల్ 60, శక్తి ఆటో కంపోనెంట్స్ 80, రియల్ పేజ్ 35, ము-సిగ్మా 22, యూ ఎస్ టి గ్లోబల్ 39, ఫ్రాంటియర్ ఎనర్జీస్ -31, ఇన్ఫోసిస్ 31, ఎల్ టి ఐ మైండ్ ట్రీ 50, మెడ్ ప్లస్ 27, ఎం ఎస్ ఎన్ లాబొరేటరీస్ 35, హెచ్ సి ఎల్ 27, సి టి ఎస్-55, ఎన్ టి టి డేటా-15, రాయల్ ఎన్ఫీల్డ్ 13, ఎస్&పి గ్లోబల్ 15, మొడాక్ అనలిటిక్స్ 14 కంపెనీల వివరాలు తెలియచేసారు. ఏం-సిగ్మా ద్వారా ప్యాకేజీ 30 లక్షలు, వివనోవేషన్ ద్వారా 20 లక్షలు, మరియు రియల్‌పేజ్ ద్వారా 10 లక్షల ప్యాకేజీలు ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఎం బి ఏ లో మిలికల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 6.6 లక్షల ప్యాకేజీ, ఫార్మసీ లో డాబర్ ద్వారా 5 లక్షల ప్యాకేజీ, 4.5 లక్షల ప్యాకేజీ హెడ్ డి ఎఫ్ సి లైఫ్ మరియు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ద్వారా అత్యధిక ప్యాకేజీలలో విద్యార్థులు చేరినట్టు తెలిపారు. ఇదే సదంర్భంలో విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల దిశగా మరియు వారి నైపుణ్యాలను పెంపొందించడానికి హనీవెల్, జిరో ల్యాబ్స్, శాప్, పెగా సిస్టమ్స్, గరుడ ఏరోస్పేస్, హెచ్ సి ఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్, ఆల్టెయిర్, ఎడ్యుస్కిల్స్ లతో గురు నానక్ విద్యా సంస్థలు ఒప్పందాలు (ఏం ఓ యూ) లు కుదుర్చుకున్నాయి. గురునానక్ సంస్థల వైస్-ఛైర్మెన్ మరియు గురు నానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లి ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వర్గస్తులైన గురు నానక్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ సర్దార్ తవీందర్ సింగ్ కోహ్లీ జ్ఞాపకార్థం ప్రతి డిపార్ట్మెంట్ నుండి మెరిట్ సాధించిన మొదటి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను బహుకరించిన తరువాత విద్యార్థులను వారి తల్లి తండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందిస్తూ మరియు వారి విజయవంతమైన మరియు సంతృప్తికరమైన భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.గురునానక్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మరియు గురునానక్ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ హెచ్.ఎస్. సైని గ్రాడ్యుయేట్లను అభినందిస్తూ ఈ స్నాతకోత్సవం గొప్ప గర్వకారణమని, వారి వృత్తి జీవితంలో ఒక ఉత్తేజకరమైన నూతన ప్రయాణానికి నాంది అని వ్యాఖ్యానించారు. అర్హత కలిగిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇప్పటికే ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలలో నియామకాలు పొందారని, ఇది తమ విద్యా సంస్థలు అందించే విద్యా నైపుణ్యం మరియు కెరీర్ సంసిద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన తెలియచేసారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన న్యూ మార్క్ మరియు కాంటర్ ఫిట్జ్గెరాల్డ్లో కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నెడ్ మోడీ మరియు హైద్రాబాద్ మెట్రో రైల్ ను నిర్వహిస్తున్న కియోలిస్ హైదరాబాద్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ డాక్టర్ రీనా దాస్ కార్యక్రమానికి హాజరై “టెక్నాలజీ మాత్రమే మార్పును తీసుకురాలేదని యువ గ్రాడ్యుయేట్ల సృజనాత్మకతే మార్పును తీసుకువస్తుందని అని వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నైపుణ్యాభివృద్ధి అనేది వారి కెరీర్లను మెరుగైన రీతిలో తీర్చిదిద్దే నిరంతర ప్రక్రియ కాబట్టి, విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని మరియు మెరుగుపరుచుకోవాలని వారు సూచించారు. డైరెక్టర్ డాక్టర్ ఎస్. శ్రీనాధ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, ప్రిన్సిపాల్ , డాక్టర్ కొడుగంటి వెంకటరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సయాల్, అసోసియేట్ డైరెక్టర్, డాక్టర్ హరూన్ రషీద్, డైరెక్టర్ ఆర్ & డి, డాక్టర్ ఎస్ వి రంగనాయకులు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్మ బి కేదార్నాథ్రి, డాక్టర్ బి సంతోష్ కుమార్ ఇతర విభాగ అధిపతులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

