Headlines

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన నంద్యాల నాయి బ్రాహ్మణులు.

-సెలూన్లకు ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణుల హర్షం.

నంద్యాల, T6 న్యూస్: నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్ ను 200 యూనిట్లకు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల నాయీ బ్రాహ్మణ సోదరులు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు నంద్యాల పట్టణంలోని 28వ వార్డు, 36వ వార్డు నందు నాయీ బ్రాహ్మణ సోదరులు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నాయీ బ్రాహ్మణ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా నంద్యాల 17వ వార్డు విశ్వనగర్ టిడిపి ఇన్చార్జి ఎం.రామ మద్దయ్య,మారుతి టిడిపి ఇన్చార్జి, ఊడుమాల్పురం సుబ్బరాయుడు ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బీసీ కులాలకు చెందిన నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ 150 నుండి 200 యూనిట్లకు పెంపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని వారు అన్నారు. నాయి బ్రాహ్మణ కళాకారులకు సంబంధించి డోలు, సన్నాయి, శృతి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సర్కులర్ విడుదల చేయడం మరియు దేవాలయాలలో పాలకమండలి సభ్యులుగా నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరుక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కట్టుబడి ఉందని, నాయీ బ్రహ్మణ సోదరుల కష్టాలు ఎరిగి, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ను పెంచిన ముఖ్యమంత్రికి వారి తరపున అభినందనలు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే దేవాలయాల్లో కేశఖండన చేసే నాయి బ్రాహ్మణుల జీతాలను రూ. 25 వేలకు పెంచామని, నేడు రాష్ట్రంలో ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్న ప్రభుత్వంపై రూ.100 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ నాయీ బ్రాహ్మణ సోదరులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, సూపర్ సిక్స్ తో పాటు అన్ని పథకాలను 100 శాతం అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సుబ్రమణ్యం ఎఈ, జిల్లెల్ల రామ పుల్లయ్య టౌన్ ప్రెసిడెంట్,నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శీనయ్య,మద్రాస్ నాగయ్య,చిందుకూరు శ్రీనివాసులు,పెద్ద రామపుల్లయ్య,కొత్తపల్లి తిరుపతయ్య,మల్లికార్జున,రవికుమార్,మాయలూరి వెంకట్,భాస్కర్,చంటి సుబ్బరాయుడు,నూనెపల్లి సుబ్బరామయ్య,సునీల్,వెంకటేష్,కిషోర్,నాగేంద్ర,సాయి,మరియు టిడిపి కార్యకర్తలు సుశాంత్, శ్రీనివాసులు,సుబ్బయ్య,సుబ్బు,శ్రవణ్ మరియు నాయి బ్రాహ్మణ సోదరులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Please follow and like us:
Pin Share