యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వేదిరే సికిందర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,T6న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కౌశిక్ రెడ్డిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికింధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో అతనిపై భౌతిక దాడులకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి రావుల నాగరాజ్, ఎన్ఎస్ యుఐ ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ మంచాల్ మండల ఉపాధ్యక్షులు కొల్లోజు విశ్వనాథ్ చారి, ఎన్ఎస్ యుఐ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుకుడాల నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

