
నంద్యాల,T6 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు చైర్మెన్/అధ్యక్షులు ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మన దేవాలయంలో తెల్లవారుజామున నుంచే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పత్ర, ఫల, పుష్పాలు మరియు తోరణాలతో విశేషంగా అలంకరించారు. విచ్చేసిన భక్తాదులందరూ స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ బంధుమిత్రులకు, భక్తులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని, అందుకు ప్రతి ఇంట్లో మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు. అనంతరం దేవస్థానం వారు విచ్చేసిన భక్తాదులందరికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ శీనయ్య, బాంబే వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

