Headlines

యూఎస్ టారిఫ్‌లతో భారత్‌కు భారీ నష్టం

అమెరికా విధించిన 50% సుంకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి.

దీనివల్ల భారతదేశానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాకు భారత్ నుండి ఎగుమతి అవుతున్న $60.2 బిలియన్ల విలువైన సరుకులు $18.6 బిలియన్లకు తగ్గే అవకాశం ఉంది.

దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాగే జీడీపీ 0.2 నుండి 0.5% వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.

టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్, మరియు ఆటోమొబైల్స్ రంగాలపై ఈ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు.

Please follow and like us:
Pin Share