
రంగారెడ్డి,T6న్యూస్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి కోరారు. మొన్న జరిగిన పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రోహిoగ్యలపై
విడుదల చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని బాలాపూర్ లో నివాసముంటున్న రోహింగ్యాల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది .బర్మా నుంచి 20 వేల మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ నివాసముంటున్నట్టు వారికి ఆధార్ కార్డు, సిమ్ కార్డు లు, డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండడానికి గమనించి పోలీస్ వారికి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ,ఆధార్ ,కార్డు సిమ్ కార్డులు ,డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తున్న ముఠాపైన చర్యలు తీసుకోవాలని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహించి వారి పైనా పిర్యాదు చెయ్యడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని రోహింగ్యాలు శుక్రవారం ఉదయం అందెల ఇంటి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని ప్రశ్నించగా రోహింగ్యానని ఒప్పుకోవడంతో వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకొని పరిశీలించగా బండిలో పెట్రోల్ బాటిల్. ఇనుప రాడ్లు కలిగి ఉండటాన్ని స్థానికులు గమనించి విచారించగా పక్క రోడ్డుపైనే మరో నలుగురు రోహింగ్యాల రెక్కీ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పోలీసు వారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేయడం జరిగింది ,అందెల శ్రీరాములు యాదవ్ రోహింగ్యాలపై చేస్తున్నటువంటి పోరాటం కొంతమందికి నచ్చక వారి ఓటు బ్యాంకు ఎక్కడ తగ్గిపోతుందోనని భయంతో రోహింగ్యాలను శ్రీరాములు యాదవ్ పై పురిగోల్పినట్టుగా అనుమానాలు ఉన్నాయి. వీరిపైన పూర్తి విచారణ చేపట్టి రోహింగ్యాల వల్ల శ్రీరాములు యాదవ్ కు ప్రాణహాని ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి ఏమాత్రం నష్టం జరిగిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అవుతుంది. కనుక వెంటనే రోహింగ్యాలను గుర్తించి వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

