
విజయవాడ క్యాంపు కార్యాలయం
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్ర సస్యశ్యామల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈలు, ఎస్ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పనులను చంద్రబాబు ఆదేశాల మేరకు మళ్లీ గాడిలో పెడుతున్నాం.
- వంశధార స్టేజ్-2 ఫేజ్-2, తోటపల్లి బ్యారేజ్ – 90% పూర్తయిన ప్రాజెక్టులు గాలికొదిలేసిన పూర్వ ప్రభుత్వం.
- వంశధార-నాగావళి, నాగావళి-చంపావతి అనుసంధాన పనులపై సమీక్ష.
- హీరమండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్-2, జంజ్యావతి రిజర్వాయర్ వేగవంతం.
- జైకా నిధులతో నత్తనడకన సాగిన రిజర్వాయర్లు – ఆండ్ర, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ – పనులపై సమీక్ష.
- ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం.
- త్వరలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

