
- అన్య మతస్తులు కార్పొరేట్ సెలూన్లను పెట్టడానికి వీల్లేదు…
- న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం..
–నాయి బ్రాహ్మణుల సంక్షేమ విభాగం..రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎం. బాగయ్య
-జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన బృందం
హైదరాబాద్,T6 న్యూస్: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు నాయి బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ విభాగం నాయకులు ప్రొఫెసర్ ఎం. భాగయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో స్థానిక నాయి బ్రాహ్మణ(మంగలి) నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కలిసి తమ వృత్తిలోకి అన్యమతస్థులు, కార్పొ రేట్ సంస్థల ముసుగులో రావడాని వ్యతిరేస్తున్నట్లు విన్నవించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… నిజాంల కాలంలో 12 కులాలకు ఇనామ్ భూములు ఇవ్వడం జరిగిందని, ఈ 12 కులాలు వృత్తి ధర్మాన్ని నెరవేర్చే సేవా కులాలు అని గుర్తు చేశారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు 5 వృత్తి ధర్మాలు ఉన్నాయని, అందులో ఒకటి క్షౌరము, మంగళ వాయిద్యం, వైద్యము, మంత్రసాని, (కాగడా) దివిటీ, ఇకపోతే నాయి బ్రాహ్మణులనీ పిలవడానికి గల కారణం పరిశీలిస్తే బ్రాహ్మణులలో సగం పనులు తామే నిర్వహిస్తాం అని అందుకే అలా పిలుస్తారన్నారు. ఉదయం లేచిన కాడి నుంచి అన్ని ముఖ్య దేవాలయాల్లో మేలుకొలుపు నుండి దివిటీ పట్టే వరకు నాయి బ్రాహ్మణుల వృత్తి అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేగాక 1982 సంవత్సరంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఫెడరేషన్లు సాధించుకోవడంతో పాటు ఆ సమయంలో ప్రభుత్వం నుండి కుల వృత్తి కి సంబంధించిన సామాగ్రిని కూడా పొందడం జరిగిందన్నారు. ఇతర మతాలకు చెందిన కొందరు వచ్చి సెలూన్లు పెట్టుకొని నాయి బ్రాహ్మణుల వృత్తి దోచేద్దామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. ఈ విషయంలో తాము హై కోర్టును ఆశ్రయించి కోర్టు నుండి ఆర్డర్ తీసుకొస్తామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సిపి రెడ్డి, నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.


కలుద్దాం- నిలుద్దాం – కులవృత్తి ” హక్కుల జీవోను ” సాధిద్దాం …
I strongly support you , for our rights Annagaru
From : Nayei Brahmana Kalyana kattala committee State president , Nayei Brahmana jena shakti Seva sangham State vice President .
Ok