శంకరమఠంలో సిఎం ప్రత్యేక పూజలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ…

Read More

మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

మర్రిగూడ, T6 న్యూస్: మర్రిగూడ మోడల్ స్కూల్ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తు రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ పీ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన విషయం…

Read More

నాయిజాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల దసరా పండుగ ఆత్మీయ అలయ్ బలయ్ సదస్సు.

నాయి బ్రాహ్మణులు రాజ్యాధికారం సాధించాలి..-ప్రముఖ వక్తలు హైదరాబాద్,T6 న్యూస్: నాయి జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో అబిడ్స్ జయ ఇంటర్నేషనల్ హోటల్ లో అలయ్ బలయ్ కార్యక్రమం శనివారం సాయంత్రం నాయిజాతి రత్నాలు సంస్థ నిర్వాహకులు ఏముల సుధాకర్, మోతె గోపాలకృష్ణ, మాసాయి రమేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కండువాలు కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్…

Read More

ముగిసిన టిడిపి సమావేశం…

అమరావతి: t6న్యూస్ ముగిసిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంఅమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం మొత్తం 7 గంటలపాటు కొనసాగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమైన వ్యాఖ్యలు: సుపరిపాలనలో తొలి అడుగు పడుతున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజల…

Read More

జెండాలు మోయడమే కాదు..ఎజెండాలు చేయడం కూడా తెలుసు.!

78 ఏండ్ల నుండి రాజ్యాధికారానికి దూరంగా బీసీలు.! రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.! రాబోయే మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం వందమందికి పైగా పార్టీలో చేరిన సభ్యులు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి.! షాద్ నగర్, అక్టోబర్ 15: రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత…

Read More

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర…

Read More

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవం

హైదరాబాద్: దాశరధి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. గొప్పకవి దాశరధి గారు ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. దాశరధీ గారి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరధీకి ఈ ప్రభుత్వం సరేనా గౌరవం ఇవ్వలేదని…

Read More

భారీగా నకిలీ ఎలక్ట్రికల్ సామాగ్రి స్వాధీనం..

బ్రేకింగ్:వరంగల్ జిల్లా తెలంగాణ.వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్ లు, స్విచ్ లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్న పలు మర్వాడీలు… పలుమార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, లక్షల రూపాయలు సరుకులు స్వాధీనం… రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది… ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు…కుదేళ్లు అవుతున్న స్థానిక వ్యాపారస్తులు…పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు…మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న యూనియన్ల లీడర్లు…అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులు…

Read More

FCI చైర్ పర్సన్ గా డీ.కె అరుణ

హైదరాబాద్,T6 న్యూస్: హైదరాబాద్ హకా భవన్ లో గురువారం రోజున FCI కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. అధికారులతో సమావేశమై రాష్ట్రంలో FCI పనితీరు, గోడౌన్ ల నిర్వహణ, ధాన్యం సేకరణ, రవాణా, సమస్యలు, పరిష్కార మార్గాలపై కీలక చర్చలు నిర్వహించడం జరిగింది. FCI కన్సల్టెటివ్ కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More