Headlines

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ,N శ్యాంసుందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మొగురాల శ్రీనివాస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ. పి గోవిందరెడ్డి రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రెటరీ, కే వేణుగోపాల్ గౌడ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు,గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share