
హైదరాబాద్,T6 న్యూస్: తెలంగాణా రాష్ట్ర నాయిభ్రాహ్మణ సంఘాల సమావేశాన్ని బిసి సాదికారిక భవన్ లో మంగళ వృత్తిదారుల రక్షణ కోసం సామాజిక భద్రత చట్టం తీసుకురావలసిన అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా తెలంగాణ నాయిబ్రాహ్మణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్ గా మానాల కిషన్ నాయి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ మానాల కిషన్ మాట్లాడుతూ.. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతు..తెలంగాణ ప్రజా ప్రభుత్వంమంగళ వృత్తిదారులకు సామాజిక భద్రత చట్టం చేయాలం డిమాండ్ చేశారు. క్షౌరవృత్తిని ఆదునికరించె ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆర్దికంగా తొడ్పాటు అందచెసి వృత్తిదారుల కుటుంబాలను ఆదుకోవాలి అన్నారు.నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసి సోసైటీలను బలోపెతం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంది సూర్యనారాయణ , రిటైర్డ్ ప్రోఫెసర్ బాగయ్య, రిటైర్డ్ ఆర్డీవో సూర్యనారాయణ, రిటైర్డ్ తహసిల్దార్ ఉప్పుల బాలరాజు, సీనియర్ నాయకులు దెవరకొండ నాగరాజు, ప్రముఖ అడ్వకేట్ మద్దికుంటలింగం, సీనియర్ నాయకులు ఆవారు జగదీష్, బిజెపి ఓబీసీ కన్వీనర్
సూర్యపల్లిశ్రీనివాస్, సీనియర్ నాయకులు బుద్దారం ధనరాజ్,చెన్నారపు మల్లెష్, మక్త శ్రీనివాస్,చెర్యాల రాకేష్, కొత్తపల్లి అభినాష్, జంపాల మనోహర్, అశోక్ అడపత్ నర్సింగ్, వినొద్, చక్రి, రాజు, వెంకట్, సురెష్, వెంకటస్వామి, రవి, రమేష్, వెంకటెష్, మాణికప్రభు, సురేష్ మరియు ఇతర ప్రముఖ సోదరులు పాల్గోన్నారు.

