Headlines

నాయీ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక విజయవంతం

నాయి బ్రాహ్మణ కులస్తులు ఇటీవల అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అయితే రాజకీయాల్లో మాత్రం కనీస స్థాయిలో కూడా లేమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య యం. బాగయ్య అన్నారు.

ఆదివారం నాడు నాయి బ్రాహ్మణ మహిళ సంక్షేమ సంఘం పక్షాన ‘ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం’ హైదరాబాదు కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఉదయం 10:00 నుండి సాయంకాలం 5 గంటల వరకు జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ తెలుగు ఆచార్యులు ఎం బాగయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రాపోలు సుదర్శన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్. సారంగపాణి, ఎం. బాలరాజు, పి.రామచంద్రరావు. కిరణ్ కుమార్, కోటేశ్వరరావు, కేఎం. రాజు, ఎ. బ్రహ్మయ్య, విష్ణువర్ధన్, డాక్టర్, మురళీమోహన్. ఎస్. శ్రీనివాస్, ఎ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వివాహ పరిచయ వేదికలో సుమారు 300 మంది తమ పేరును నమోదు చేసుకున్నారని అనంతరం వాడువారుల పరిచయ కార్యక్రమం కొనసాగిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గారాణి తెలిపారు. గౌరవధ్యక్షురాలు ఎల్. అనుపమ,ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి వై రేణుక ,కార్యదర్శులు నాగలక్ష్మి, లక్ష్మి, యెన్ జే యస్ శ్రీధర్ మురహరి, వి ఎఫ్ ఓ రాకేశ్ , సత్యం కానుగుల, చెన్నారం మల్లేష్, కార్టూనిస్టు నారు, ఏఈ తూముల శ్రీనివాస్, అడ్వకేట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share