Headlines

గురు నానక్ విద్య సంస్థలలో ఘనంగా జరిగిన ఒరియెంటేషన్ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్ట్ 20: ఇబ్రహీంపట్నం గురు నానక్ విద్యాసంస్థలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యార్థుల కోసం ఒరియెంటేషన్ కార్యక్రమం నూతన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంతోపాటు, సంస్థ యొక్క విలువలు, దృష్టికోణం మరియు విద్యా సంస్కృతిని వారికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్ర‌యాగ్ కన్స్యూమర్ కేర్ సంస్థలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్…

Read More

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

చింతపల్లి T6 న్యూస్: ప్రతి ఒక్కరు పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు….

Read More

డాక్టరేట్ పట్టా స్వీకరించిన ప్రవీణ

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్. కుమార్ మోలుగారం చేతుల మీదుగా జియాలజీ డిపార్ట్మెంట్ లో ప్రవీణ మహేశ్వరం పీహెచ్ డి పట్టాను అందుకున్నారు. డా. ఎం ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ” ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దవాగు బేసిన్ నీటి నాణ్యత పై చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ మార్చి 2024లో డాక్టరేట్ ను ప్రకటించింది.. ఈ సందర్బంగా పరిశోధనకు సహకరించిన ఉస్మానియా…

Read More

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలు..

రంగారెడ్డి కలెక్టరేట్: జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ రంగారెడ్డి జిల్లా ఆద్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు గిరిజన విద్యార్థులకు 1 వ తరగతిలో ప్రవేశము కొరకు లాటరి పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కు గాను లంబాడ – 4, ఎరుకల – 1, ఇతర గిరిజన తెగలు – 1 , మొత్తం – 6 ( బాలురు – 3, బాలికలు –…

Read More

అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి. సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సచివాలయం: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ⛈️ రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో…

Read More

సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్…

Read More

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. కలెక్టర్ సి నారాయణ రెడ్డి

రంగారెడ్డి కలెక్టరెట్: ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

Read More

అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దు.. కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి : ప్రజావాణికి ( 61) ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కె. శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా…

Read More

గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ లో 21వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే 2025

ఇబ్రహీంపట్నం, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థలో నేడు 21 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను మరియు పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గురు నానక్ విద్యాసంస్థలైన జి.ఎన్.ఐ.టి.సి మరియు జి.ఎన్.ఐ.టి నుండి సుమారు 1970 మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించడం జరిగింది. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు…

Read More

మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతం

అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నా చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు వందనం. సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగింది.బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు పునర్వైభవం వచ్చింది. పనులు లేక, పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించిన ఘనత…

Read More