Headlines

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలు..

రంగారెడ్డి కలెక్టరేట్: జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ రంగారెడ్డి జిల్లా ఆద్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు గిరిజన విద్యార్థులకు 1 వ తరగతిలో ప్రవేశము కొరకు లాటరి పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కు గాను లంబాడ – 4, ఎరుకల – 1, ఇతర గిరిజన తెగలు – 1 , మొత్తం – 6 ( బాలురు – 3, బాలికలు – 3) సీట్లను కేటాయించడం జరిగగింది. బాలికలు 3 సీట్లకు గాను 2 దరఖాస్తులు వచ్చినందున 2 సీట్లను యునానిమస్ గా ఎంపిక చేయడం జరిగింది. మరియు 1ఎరుకల సీటుకు గాను 1 దరఖాస్తు వచ్చినందున యునానిమస్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన 2 లంబాడ బాలురులకు గాను 10దరఖాస్తులు వచ్చినందున అందులో నుండి 2 సీట్లను లాటరి పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది.

Please follow and like us:
Pin Share