
- కురుమల ఐక్యతకు చిహ్నంగా బీరప్ప స్వామి కళ్యాణ ఉత్సవం
-మల్‌రెడ్డి రాంరెడ్డి
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న శ్రీ బీరప్ప స్వామి, కామరతి దేవి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, భద్రత వంటి అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులు, నిర్వాహకులకు సూచించారు.
అలాగే, స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహణ ఉండేలా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. తమ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బీరప్ప స్వామి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
స్థానికులు, కురుమ సంఘం నాయకులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మల్‌రెడ్డి యాది రెడ్డి గారు, మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, మేకం శ్రీశైలం గారు , లక్ష్మి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, పన్యాల జైపాల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, లింగం గారు, కురుమ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

