
ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా సెలబ్రిటీలు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఈ బాట పట్టగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా చేరింది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోల కోసం నెలకు రూ.390 చెల్లించాలని సిరి కోరుతోంది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రిప్షన్‌లో 426 మంది ఉండగా, నెలకు సుమారు రూ.1.6 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

