సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్…

Read More

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దామన్న పేరు : సీఎం రేవంత్

నల్గొండ/సూర్యాపేట,T6 న్యూస్: ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి(దామన్న) ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు…

Read More

మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

మర్రిగూడ, T6 న్యూస్: మర్రిగూడ మోడల్ స్కూల్ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తు రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ పీ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన విషయం…

Read More

మానవ రూపంలో దేవతలు సమ్మక్క.. సారక్క.. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఆ దేవతల దర్శనం సంతృప్తినిచ్చింది.. మేడారం సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. మేడారంలో ఎమ్మెల్యే తులాభారం.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి.. ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు వరంగల్: మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన సమ్మక్క- సారక్కల…

Read More

పహల్గామ్ దాడి తర్వాత 21 మంది ఉగ్రవాదులు ఖతం..

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తున్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు. ఆపరేషన్ అఖల్: ఆపరేషన్…

Read More

కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేళ.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్..!

హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం. ‘సన్నబియ్యంతో తెలంగాణ పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో 5.61 లక్షల…

Read More

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు కూడా దూరమే: అనుపమ

హైదరాబాద్,T6న్యూస్: లేడీ ఓరియంటెడ్‌ సినిమా అంటే ఎవరూ ముందుకురారు అని నటి అనుపమ పరమేశ్వరన్‌ పేరొన్నారు. ‘థీమ్‌ ఆఫ్ పరదా’ పాట విడుదల సందర్భంగా గురువారం అనుపమ మాట్లాడుతూ.. “మా సినిమా ఏడాది క్రితమే రెడీ అయింది. పెద్ద సినిమా రిలీజ్‌ అకారణంగా మాకు థియేటర్లు దొరకలేదు. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు.” అని అన్నారు.

Read More

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్, జూలై 4: హైదరాబాద్‌లోని గాంధీభవన్ సమీపంలో గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ భేటీ సందర్భంగా అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును భవనంలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భద్రతా సిబ్బందితో…

Read More

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవం

హైదరాబాద్: దాశరధి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. గొప్పకవి దాశరధి గారు ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. దాశరధీ గారి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరధీకి ఈ ప్రభుత్వం సరేనా గౌరవం ఇవ్వలేదని…

Read More

చింతమడకకు కవిత..

చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మార్గమధ్యలో సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Read More