ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..
అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…
