
హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మార్కెట్ కి వచ్చే ప్రతి రైతుకు న్యాయం చేసేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. అధిక కమిషన్లు వసూలు చేసే మార్కెట్ వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బాటసింగారం లాజిస్టిక్ పార్క్ లో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తే కొంతమంది భూములు మరియు షెడ్స్ అదిక రేట్లకు మార్కెట్ కి ఇచ్చారని వాటిని తగ్గించాలని లేని పక్షంలో మార్కెట్ పాలకవర్గం వాటి స్థానంలో కొత్త షెడ్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ ముందు కొంత మంది దళారులు వ్యాపారం చేస్తూ మార్కెట్ ఆదాయంకు గండి కొడుతున్నారని. రైతులకు మార్కెట్ లో అవకాశం ఇస్తామని. దళారులకు చోటు లేదని పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోహెడలో ఏర్పాటు చేయబోయే అధునాతన మార్కెట్ కి త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని దేశంలోనే మంచి సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం అయితే పక్కన ఉన్న ప్రభుత్వ భూములను మార్కెట్ కి అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహమ్మద్ రియాజ్, DE రవీందర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్ తో పాటు వైస్ చైర్మన్ CH. భాస్కర చారి, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, అంజయ్య, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్, నర్సింహ, వెంకట్ గుప్తా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

