పర్వతాలును అభినందించిన హెచ్.సి.యు. వీసీ. బి.జె. రావు
హైదరాబాద్,T6 న్యూస్, ఆగస్ట్ 6: పంబాల కులానికి ప్రత్యేకమైన సంప్రదాయ కళా రూపమైన పంబ కళపై నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల పర్వతాలు జరిపిన లోతైన పరిశోధనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి విశేష అభినందనలు లభించాయి. పంబాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను సాంప్రదాయ కళల దృష్టికోణంలో విశ్లేషిస్తూ, ఈ పరిశోధన నూతన కోణాన్ని ప్రతిపాదించింది. ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన పంబాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకుని, పర్వతాలు పేదరిక…
