Headlines

కాళేశ్వరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన కమీషన్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ , సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

ఈ కమిటీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది.

Please follow and like us:
Pin Share