


ఆందోల్
మొదటి విడత జనహిత పాదయాత్రలో భాగంగా రెండో రోజు ఆందోల్ లో టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ
- పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం
- మహాత్మా గాంధీ మొదలుకొని రాహుల్ గాంధీ జోడయాత్ర వరకు పాదయాత్రలు కొనసాగుతూ వస్తున్నాయి
- అధికారంలో ఉన్నపుడే పాదయాత్రల అవసరం ఉంది. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంది
- ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
- పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అధికారంలో ఉంది
- ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు
- గడీల పాలన అంతముందించి ప్రజా పాలనను అందించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న
- పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ మీతో జరిపే సంభాషణలు ముఖ్యమంత్రికి చేరవేసేందుకు వీలుంటుంది
- కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి 6 గ్యారంటీల అమలు, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది
- గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన…కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయో సభా ముఖంగా చేతులెత్తి తెలపాలని కోరుకుంటున్నా
- పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబానికి తప్పా.. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబానికి ఒక్క ఉద్యోగం రాలేదు
- కాంగ్రెస్ ప్రభుత్వం 11 మాసాల్లో 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 35 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఇచ్చి తీరుతాం.
- ధనవంతుల మాదిరి పేదలు సన్న బియ్యం తింటారని ఎవరైనా ఊహించారా?
- దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ అమలు చేస్తున్నాం
- కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి 3 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నా ఘనత కాంగ్రెస్ పార్టీది
- విద్య ,వైద్య రంగాలను ఆధునికరిస్తున్నాం
- సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం
- కేసిఆర్ హయంలో ప్రవేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకున్న పాపాన పోలేదు
- పదేళ్లలో చేసిన పాపాలతో కేసిఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు
- మీ జిల్లా నాయకుడు హరీష్ రావు ఆరడుగులు ఉంటాడు నోరు విప్పితే అబద్ధాలు
- బనకచెల్ల ప్రాజెక్ట్ ఎవరి చేతకానితనం వల్ల కట్టారు హరీష్ రావు?
- హరీష్ రావు కెసిఆర్ సంతకం పెడితే బనకచెర్ల నిర్మాణం జరిగింది
- తెలంగాణ నీటి వాటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది
- తెలంగాణ ఒక్క నీటి చుక్క పోనీయమ్మని ప్రజల ముఖంగా వాగ్దానం చేస్తున్న
- కేసిఆర్ సర్కార్ తాకట్టు పెట్టిన నీటి వాటాను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉంది
- కెసిఆర్ దూరదృష్టం లేకుండా రాష్ట్రాన్ని అప్పులమాయంగా మార్చారు
- కేసిఆర్ చేసిన పాపానికి వడ్డీలు కడుతున్నాం
- నోరు తెరిస్తే అబద్దాలు ఆడే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు
- కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడితే.. కవిత రంగులు పూసుకోవడం హాస్యాస్పదం
- జగ్గన్న చెప్పినట్లు 42 శాతం రిజర్వేషన్లకు కవితకు ఏం సంబంధం?
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నప్పుడు కవిత జైల్లో ఉన్నారు
- ఊసరవెల్లిలా రంగులు మార్చేవారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరం

