— మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

విద్యుత్ ఉత్పత్తి విభాగంలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న ఈ థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్-1 లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ అడ్లూరి లక్ష్మణ్ , శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ఇతర శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి జాతికి అంకితం చేశారు..
ఈ డిసెంబరు చివరి నాటికి అన్ని యూనిట్ల పనులను పూర్తి చేసి 4000 మెగా వాట్లు కలిగిన విద్యుత్ ఉత్పత్తిని 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని మంత్రుల బృందం వెల్లడించారు
అలాగే మంత్రులు పవర్ ప్లాంట్ ఆవరణలో ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..
ప్లాంట్ చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది, ఈ ప్రాంత ప్రజల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అత్యాధునిక వసతులతో ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, బొగ్గు మరియు బూడిద లారీల కారణంగా దెబ్బతిన్న రోడ్లను సిసి రోడ్లుగా మారుస్తున్నాం..
ఇందుకోసం రూ.280 కోట్లను మంజూరు చేయడమే కాకుండా అవసరమైన క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అని అన్నారు.
నష్టపరిహారాలు, భూసేకరణ వంటి అంశాలను వెంటనే పూర్తి చేసి, యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణాలు పూర్తి చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రులు.

