

రంగారెడ్డి, T6 న్యూస్: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌లో BBA మరియు BCA కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థుల కోసం రెండవ ఒరియంటేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. డా. హెచ్.ఎస్. సైనీ, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకొని, విద్యను ప్రయోజనకరంగా మలచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తన సందేశం ద్వారా విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సమయ నిర్వహణతో విద్యను సాగించాలని సూచించారు.కార్యక్రమంలో డా. విశాల్ వాలియా, రెజిస్ట్రార్ , డా. సి . కలయరాసన్, రెక్టర్,ప్రొఫెసర్ సలారియా, డీన్, మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ (యూఐసీఎస్ ఏ ) , డా. పి. పార్థసారధి, డైరెక్టర్ ప్లానింగ్, డా. రోజ్ మేరీ, హెడ్ – యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ (యూ ఐ ఏం సి), డాక్టర్ దేబశీష్ పాండా – కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్, డాక్టర్ మహేంద్రన్ బోట్లగుంట – డీన్ ఆర్ & డి మరియు ఇతర విభాగ అధిపతులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మంచి విద్యాభ్యాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. అకడమిక్ విధానాలు, పరీక్షా విధానం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్స్, విద్యార్థి సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను పరిష్కరించుకునే అవకాశం కల్పించినందుకు సంతోషము వ్యక్తం చేసారు.

