Headlines

అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం

చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరి పైన గణేష్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు తెలిపారు.లంబోధరుడు, ఏకదంతుడు, తొలి పూజలు అందుకునే భగవంతుడు బొజ్జ గణపయ్యను.. అందరికీ సిద్ధి, బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలో హాయిగా భగవంతుడిని తలుచుకోవడం, గణనాథుడి స్మరణలో సమయం గడపడం విశేషమన్నారు. విద్యుత్ కాంతులలో వివిధ రకాల వేషాధారణలతో చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నారు. మహిళలు యువతులు కోలాటాలు బతుకమ్మలతో ఆడి పాడి సంతోషం వ్యక్తం చేశారు. పోయిరావయ్య గణపయ్య అంటూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా గోవిందు నారాయణ, భారతమ్మ,గిరి, రఘు,బోగరాజు మధుసూదన్ కుటుంబ సభ్యులు, గోవిందు శాంతయ్య, శివ,చెట్లపల్లి హరిప్రసాద్, సముద్రాల నగేష్, మేకల నరసింహ్మ, ,చెట్టిమల్ల ప్రశాంత్,నరేష్, రామకృష్ణ, పానుగంటి రాము, వికాస్, రాజేష్, గజ్జ అభినవ్,గజ్జ శ్రీను, వెంకటేష్,కొప్పుల శ్రీను, తదితర యూత్ కమిటీ అసోసియేషన్ కమిటీ సభ్యులు, తదితర ఆత్మీయ బంధువులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share