


చింతపల్లి, T6న్యూస్: చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న గణపతులు శనివారం నవరాత్రులు ముగియడంతో అంగరంగ వైభవంగా శోభాయాత్రలతో గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండల కేంద్రంలో మీ పాత గ్రామంలో కొలువై ఉన్న శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డు వేలం పాటలో భాగంగా పెద్ద లడ్డును లాటరీ సిస్టం ద్వారా కొనసాగించారు. 200 మంది భక్తులు పెద్ద లడ్డుకు పోటీపడి టోకెన్లు స్వీకరించగా అదృష్టవశాత్తు ఆర్యవైశ్య చింతపల్లి మండల అధ్యక్షుడు వందనపు ఆంజనేయులు లాటరీలో గెలుపొంది పెద్ద లడ్డును కైవసం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. వేలం పాటలో చిన్న లడ్డును 76 వేల ర్జుపాయలకు పాటపాడి చింతపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి దక్కించుకున్నారు. గణనాథుని మెడలో ఉన్న పైసల దండను 45 వేల రూపాయలకు పాటపాడి జెల్లా యాదగిరి చేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించి శోభాయమానంగా శోభాయాత్రలో పాల్గొని బ్యాండు, భజనలు, మహిళల కోలాటాలతో రకరకాల నృత్యాలు నిర్వహించి లంబోదరుని ముందు తమ భక్తిని చాటుకుని చింతపల్లి పెద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా బంగ్ల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా లంబోదరునికి నిత్య పూజ నిర్వహించి లడ్డు వేలం పాట నిర్వహించారు. పెద్ద లడ్డు వేలంపాటలో పాట పాడి కడారి సత్తి యాదవ్ 1, 33,000 వేల రూపాయలకు పెద్ద లడ్డు పాట పాడి కైవసం చేసుకున్నారు. చిన్న లడ్డు కొప్పుల వెంకటయ్య 65 వేల రూపాయలకు పాట పాడి చేజిక్కించుకున్నారు. గణేశుని మెడలోనున్న పైసల దండను 30 వేల రూపాయలకు పాట పాడి కొప్పరి శివ కైవసం చేసుకున్నారు. అనంతరం భాజభజంత్రీలతో మహిళలు, యువతులు, యువకులు ఏకరూప దుస్తులు ధరించి వినాయకుని శోభాయాత్రలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడి నృత్యాలు నిర్వహించి స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించి చింతపల్లి పెద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమం చేశారు. అనంతరం ప్రతి ఇంటికి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోమరాజు ప్రదీప్, గోవింద్ ప్రసాద్, గోవిందు రవికుమార్, చెట్లపల్లి హరిప్రసాద్, వెన్నం శేఖర్, శ్రీకాంత్, వందనపు భూషయ్య, సోమరాజు సాయి, సోమరాజు కిషన్, చెన్నయ్య, మన్మధాచారి నేతాల సైదులు దాచేపల్లి మధు, సముద్రాల నగేష్, కుంభం శ్రీనివాస్ రెడ్డి, గునుకుల రమేష్, ఆకుతోట జంగయ్య, బంగ్లా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మోర వెంకటరమణ,బొడ్డు మహేష్, కొప్పరి సైదులు, డబ్బికార్ శీను, ఏడు కొండలు,చెనమోని హరీష్, చెనమోని వెంకటేష్, అంజిబాబు, ఎల్లేష్, తదితరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో నవరాత్రులను సమయానికి విచ్చేసి పూజలు నిర్వహించి నిర్విఘ్నంగా కొనసాగించిన ఆదిత్యుని సత్యనారాయణ శర్మను చింతపల్లి శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన భక్తులందరికీ పేరుపేరునా బంగ్లా ఉత్సవ గణేష్ కమిటీ, శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

