అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత.
తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నా చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు వందనం.
సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగింది.
బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు పునర్వైభవం వచ్చింది.
పనులు లేక, పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్ గారిది.
చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
నరాలను పోగులుగా,
తమ రక్తాన్ని రంగులుగా,
గుండెలను కండెలుగా మార్చి,
చెమట చుక్కలను చీరలుగా మలిచి,
మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

