
మర్రిగూడ, T6 న్యూస్: మర్రిగూడ మోడల్ స్కూల్ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తు రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ పీ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి , డీఈవో బిక్షపతి కి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత సోమవారం డిడి దుర్గాప్రసాద్ విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ప్రిన్సిపల్ అవినీతికి పాల్పడిందని రుజువు చేస్తూ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

