
రంగారెడ్డి,T6 న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు జరిగాయి. మంచాల మండల మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ పోచమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

