
అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామి రెడ్డి
చౌటుప్పల్, T6 న్యూస్: అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం
మున్సిపల్ కమిషనర్ గౌరవ శ్రీ జి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు
ట్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలని అన్నారు. అందరూ బట్ట సంచులు వాడి పర్యావరణాన్ని రక్షించాలి. ప్లాస్టిక్ ను వాడకూడదు ప్రాణాలను తీయకూడదు అని తెలిపారు. భావి భారత పౌరులైన మీరు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు మీరు చెప్పాలి, మీరు చెప్తే వాళ్ళు వింటారు అని, మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని పిల్లలకి సూచన చేయడం జరిగింది. నిత్యజీవితంలో మానవుడు తనకు తెలియకుండానే సుమారు ఎనిమిది కేజీల ప్లాస్టిక్‌ను వివిధ రూపాల్లో తినడం జరుగుతుంది . తద్వారా మన శరీరంలో జన్యుపరమైన మార్పులు జరిగి ఊహించని జబ్బులు క్యాన్సర్లు వస్తున్నాయి. మానవుడు సంతోషంగా ఉండాలంటే,ఆరోగ్యమైన జీవితం కొనసాగించాలి అంటే ప్లాస్టిక్ నివారించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ టి.రఘుపతి, మున్సిపల్ సిబ్బంది, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్,TMC శ్రీమతి కవిత , పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.“ఆనందంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి“

