

దేవరకొండ,T6 న్యూస్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరామాలయం శ్రీ మల్లికార్జున సీతారామ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించి, గణనాథుని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
గణేష్ ఉత్సవ కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ, ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు దేవరకొండ ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
రామయలం వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేట్ సిరాజ్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ పట్టణ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు బిక్కు నాయక్, ఏడ్పుల గోవింద్ యాదవ్, ధర్మకర్త రఘురామ్, నక్క వెంకటేష్ యాదవ్, నాయకులు భరత్ కుమార్,పట్టణ మాజీ కౌన్సిలర్ భూదేవి సైదులు, గాజుల మురళీ,అడ్వకేట్ ఉమా మహేశ్వర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకులు కొర్ర రాంసింగ్ నాయక్,YS కరుణాకర్, బాబురాం, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

