
నూతన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్
దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను సంబంధిత అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపట్టాం.
గత పదేళ్ల పాలనలో ప్రజలకు బిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే – కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కొత్తగా 5 లక్షల ,60,000 వేల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం.
26 లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులలో చేర్చడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ పై సన్న బియ్యం ఇస్తున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు – స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది.
ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక మతిభ్రమించి,పిచ్చి కుక్క లాగా కేటీఆర్ ప్రవర్తిస్తున్నాడు.
గత నిరంకుశ ప్రభుత్వాన్ని పడగొట్టి, ప్రజాపాలనా తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డిది.
రేవంత్ రెడ్డి పేరు ఎత్తనిదే పూటగడవదన్నట్టు బూతులు, అబద్ధాలతో బావ, బామ్మర్దులు రెచ్చిపోతున్నారు.
గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూస్కోండి.
గతంలో ఐఏఎస్ అధికారులను మీ కాళ్ళ దగ్గర కూర్చొపెట్టుకుని నిరంకుశంగా పాలించిన ప్రభుత్వం మీది.
ప్రజాపాలనలో అధికారులను గౌరవిస్తూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.
అధికారుల సలహాలు పాటించకుండా నీ అయ్యా (కేసీఆర్ )సొంత తెలివితో కాళేశ్వరం కట్టడం వల్లే కూలిపోయింది.
3 ఏండ్ల తర్వాత కాదు 30 ఏండ్లు అయినా రాష్ట్రంలో తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి రాదు.
రేవంత్ రెడ్డి దమ్మున్న మొగోడే కాబట్టి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.
మీరు ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తే, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ముఖ్యమంత్రి ప్రజాపాలనా కొనసాగిస్తున్నారు.
త్వరలో జరిగే లోకల్ బాడిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు,మాజీ జెడ్పీటీసీలు,మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మహిళలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

