Headlines

కుటుంబ సమేతంగా మహంకాళి అమ్మవారి దర్శనం…

హైదరాబాద్, T6 న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రశంసించారు.* అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మరింతగా పెంపొందాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మహేష్ గౌడ్ పునరుద్ఘాటించారు.

Please follow and like us:
Pin Share