


రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని కొత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికను పురస్కరించుకొని కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు.ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలాజీ, కౌన్సిలర్స్ మాదారం నర్సింహా గౌడ్,జె అనిత శ్రీనివాస్ గౌడ్,సోమ్లా నాయక్,సి చంద్రకళ రాజేందర్ గౌడ్,పి మాదవి గోపాల్ గౌడ్, మెడికల్ ఆఫీసర్ డా. రాజేష్, ఎమ్ ఎల్ హెచ్ పి డాక్టర్లు, సి ఎచ్ ఓ నగేష్,వైద్య సిబ్బంది, మెప్మా సిబ్బంది మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

