
మహబూబ్ నగర్,T6 న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రూ.54 కోట్ల పిఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించాను. అనంతరం రూ. 60 లక్షలతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది.
- పిఎం శ్రీ కింద పాఠశాల ఎంపిక కావడం, ఆ నిధులతో పనులు పూర్తి చేసుకోవడం అభినందనీయం.
- నరేంద్ర మోదీ గారు ఒక విజన్ తో పిఎం శ్రీ పథకం ప్రారంభించారు. 2022 – 23 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు.
- ఈ దేశంలో అందరికీ విద్య అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
- అందులో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం తీసుకొచ్చింది.
- ఈ పథకం కింద మొదటి ఫేస్ లో మంజూరైన రూ. 54 లక్షలతో రాజాపూర్‌లో స్కూల్ నిర్మాణం జరగడం శుభపరిణామం.
- పిఎం శ్రీ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 794 పాఠశాలలు మంజూరు అయ్యాయి.
- అటల్ టింకరింగ్ పథకం కింద విద్యార్థులకు టెక్నికల్ మెలకువలు నేర్పిస్తారు.
- ఏఐ విద్య బోధన ఇక్కడ త్వరలో ప్రారంభం కాబోతుంది.
- విద్యార్థుల సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను.
- మహబూబ్ నగర్ జిల్లాకూ నవోదయ మంజూరు అయింది.
- అనుకూలమైన స్థలంలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేస్తాము.
- అందుకోసం నా పూర్తి స్థాయి సహకారం ఉంటుంది.
- ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువుల్లో రాణించాలి, పాలమూరు ప్రతిష్టను కాపాడాలి.

