-వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి
-చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ,T6 న్యూస్: కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేదని, ఈ పథకాల ద్వారా ప్రజలకు బాకీ ఉన్న డబ్బులను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం” ను వ్యాప్తంగా విస్తృతంగా చేపడతామని అన్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు.మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి వేదికలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని ఆయన అన్నారు.ప్రజలను నమ్మించడానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టి అధికారం లోకి వచ్చింది.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు.పథకాల అమలు తక్కువ… ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది.అనాడు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తాం అంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గ్యారంటీ కార్డు లు ఇచ్చి మోసం చేసిందో ప్రజలకు వివరిస్తాము.ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు.22 నెలలుగా 2500 చొప్పున 55000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది అని ఆయన అన్నారు.వృద్దులకు,పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. 22 నెలలుగా వృద్ధులకు బీడీ పెన్షన్ దారులకు కాంగ్రెస్ 44,000 బాకీ పడింది అని ఆయన తెలిపారు.దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలు చేయక ప్రతి దివ్యంగునికి 22 నెలల్లో 44,000 కాంగ్రెస్ బాకీ పడ్డది, రైతు భరోసా 15,000 చొప్పున రైతులకు,కౌలు రైతులకు 14 నుండి 19 వేలు, రుణమాఫీ 2,00,000 బాకీ ఉంది,బోనస్ ప్రతి ఎకరాకు 12500 చొప్పున నాలుగు పంటలకు 50,000 రైతుకు కాంగ్రెస్ బాకీ పడింది అని,విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు ఇవ్వలేదు.ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున రెండు ఏండ్లకు 24,000 కాంగ్రెస్ బాకీ ఉంది అని,విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, 22 నెలలుగా ఇవ్వని నిరుద్యోగ భృతి 88,000 కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది అని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ 8000 కోట్లు కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలు ద్వారా ప్రజలకు ఎంత బాకీ పడిందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు పంచుతం అని అన్నారు.పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజల్లోకి విస్తృతంగా ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలి. ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, వివరిస్తూ అవగాహనా కల్పించాలి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు ఉజ్జిని విద్యాసాగర్ రావు,కొండూరు శ్రీనివాస్, బాదేపల్లి పులిరాజ్,శ్రీశైలం,జగన్,నరేష్,రామకృష్ణ,కార్యకర్తలు పాల్గొన్నారు .

