Headlines

హెచ్‌1-బీ వీసా ఫీజులపై వైట్‌హౌస్‌ స్పష్టత

వాషింగ్టన్‌, T6 న్యూస్: అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న హెచ్‌1-బీ వీసాలపై ఫీజు పెంపు అంశంపై వైట్‌హౌస్‌ కీలక స్పష్టతనిచ్చింది. ప్రస్తుత వీసాలు కలిగినవారికి, వాటి పునరుద్ధరణ (రిన్యువల్‌) సందర్భాల్లో ఎటువంటి పెంపు ఉండదని స్పష్టం చేసింది. కొత్త వీసా దరఖాస్తుదారులకే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని తెలిపింది.

2025 లాటరీ ద్వారా మంజూరయ్యే వీసాల విషయంలోనూ పాత ఫీజులే కొనసాగుతాయని వైట్‌హౌస్‌ అధికారి వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల ఫీజు జీవితకాలానికి ఒక్కసారే వసూలు చేయబడుతుందని, పునరావృతం కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు ఊరట కలిగించనుంది.

హెచ్‌1-బీ వీసాలు అమెరికా ఐటీ రంగం, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్‌ వంటి అనేక రంగాల్లో పనిచేసే నిపుణులకు ప్రధానాధారంగా నిలుస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అధిక ఫీజు అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే కొత్త అభ్యర్థులపై మాత్రమే ప్రభావం చూపనుంది.

Please follow and like us:
Pin Share