విజయవాడ,T6 న్యూస్: రేపటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని ఐదు ప్రదేశాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ్ కమిటీ సభ్యుడు పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ కోసం ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోయినా, ఈసారి విజయవాడ ఉత్సవ్ ద్వారా ప్రజలకు వినోదంతో పాటు భక్తి శ్రద్ధలను పునరుద్ధరించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.
ఉత్సవ్ కార్యక్రమాల వల్ల అమ్మవారి శోభ ఏమాత్రం తగ్గదని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని వర్లరామయ్య స్పష్టం చేశారు.

