Headlines

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. ఏబివిపి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు .సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 500 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని దీని కారణంగా వేలాదిమంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి నెలకొందని దీని కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎన్నికలు పూర్తయి రెండు సంవత్సరాలైనా రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరమని మీ పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కళ్లెం సూర్య ప్రకాష్, జిల్లా కన్వీనర్ చందు, ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చరణ్,సిటీ జాయింట్ సెక్రెటరీ పవన్, సిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్రీతి, నగర కార్యదర్శి భరత్, విజయ్ ,మనీష్, దినేష్, మేఘన,సంధ్య ,ప్రవలిక,శరణ్య,సాత్విక, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share