Headlines

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

చింతపల్లి T6 న్యూస్: ప్రతి ఒక్కరు పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని ఆయన వేడుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share