Headlines

బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు

హైదరాబాద్‌,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని తెలిపారు. బీజేపీకి మద్దతు పెరుగుతోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. అందరితో కలసి పనిచేస్తా. నైతికంగా బలమైన బీజేపీని నిర్మించేందుకు ప్రతిపాదనలు, వ్యూహాలతో ముందుకు వెళ్తా,” అని ఆయన హామీ ఇచ్చారు. రాంచందర్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది కీలకదశగా భావిస్తున్నారు నేతలు. రాంచందర్‌రావు గతంలో హైదరాబాద్ ఎమ్మెల్సీగా సేవలందించిన అనుభవం, బలమైన పరిపాలనా విజన్ పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.

Please follow and like us:
Pin Share