బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు
హైదరాబాద్,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని…
