Headlines

జన్ ఆరోగ్య సమితి (జే. ఏ.ఎస్) సమావేశం..

హైదరాబాద్,T6 న్యూస్: ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్ ఆరోగ్య సమితి (జే.ఏ.ఎస్) సమావేశాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు, రోగులకు మందులు, రక్త పరీక్షలు, గర్భిణీలకు అందించవలసిన మాత్రలు, మలేరియా, డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వ్యాధులకు సరైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమ్మెర సమ్రిన్ మాట్లాడుతూ.. రోగులకు వైద్యం అందిస్తూ, వారికి ఉచితంగా మందులను అందిస్తున్నామన్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పలువురుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ బస్తి దవాఖాన డాక్టర్ మజీర్, ఎల్ టి స్వాతి,ఏఎన్ఎం లు జ్యోత్స్న, మెహనాజ్ ,విమల ,లక్ష్మి పావని, స్టాఫ్ నర్స్ లు నాగరాణి, సుజాత,డిఓ ప్రతిమ. ఎం పి హెచ్ ఏ (ఎం) శరత్ కుమార్, ఎంటమాలజీ, ఇతర జిహెచ్ఎంసి అధికారులు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share