హైదరాబాద్: దాశరధి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. గొప్పకవి దాశరధి గారు ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. దాశరధీ గారి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరధీకి ఈ ప్రభుత్వం సరేనా గౌరవం ఇవ్వలేదని బాధ ఉన్నది. మన వంతుగా మన దాశరధీనీ గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించి తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా, సంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటటువంటి సంస్థగా మన వంతు కర్తవ్యంతో ఈ సభను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చదవి అర్థం చేసుకొని వారి పనిలో కార్యరూపం తెచ్చిన వారిని ఆహ్వానించుకోవడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కే శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పిలవడం జరిగింది. దాశరధీ సొంత బిడ్డ లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరం. చిన్న కోడూరులో జన్మించి పెద్ద గుండె కలిగిన వ్యక్తి దాశరధి ఇవ్వాల మనం ప్రజాస్వామ్యంలో ఉంటే , ఒకప్పుడు రాచరికంలో ఉన్నాము. రాచరిక పాలనలో మాట్లాడితే గొంతులుకోసే కర్కోటమైన పాలన జరుగుతుండేది. అలాంటి సమయంలో చిన్న గూడూరు జన్మించిన దాశరధి. చిన్న గూడూరులో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు. అన్యాయాన్ని ఎదిరిస్తున్న దాశరధిని ఆ ఊరు నుంచి ఆ కుటుంబాన్ని ఎల్లగొడితే ఖమ్మం వెళ్ళి తలదాచుకున్నారు. అయినా సరే ఆనాడు హైదరాబాద్ స్టేట్ గా ఉన్న రాష్ట్ర మొత్తం జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేవాడు. ధైర్యంగా నిజం రాజును ఎదిరించి ప్రజల్లో చైతన్యం నింపిన వాడు దాశరధి. చాలా మందినీ ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం . వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏసీ రూములలో కూర్చొని అక్కడినుంచే ప్రపంచాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. ఏసీ రూముల నుంచే ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆనాడు దాశరధి ఆదివాసులు , గిరిజనులు , హరిజనుల దగ్గరికి వెళ్లి సామాజిక వివక్షను తుడిచి పెట్టాలని అనుకున్నాడు. సామాజిక వివక్షను తుడిచిపెట్టాలంటే కవిత్వమే నా ఆయుధం అనుకున్నారు దాశరథి.

